గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయుల సేవలు 2026-27 వరకు పొడిగింపు

675చూసినవారు
గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయుల సేవలు 2026-27 వరకు పొడిగింపు
గిరిజన సంక్షేమ విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్స్ టీచర్లను (CRT) 2026-27 విద్యా సంవత్సరం వరకు కొనసాగించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం జిల్లా CRT యూనియన్ అధ్యక్షులు చిన్నయ్య ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఉత్తర్వుల వల్ల జిల్లాలోని 12 గిరిజన మండలాల్లో పనిచేస్తున్న 316 మంది CRTలకు ప్రయోజనం చేకూరుతుంది. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకులకు యూనియన్ నాయకులు పద్మావతి, శైలజ కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్