బ్రిడ్జిపై ఉధృతంగా వరద నీరు

1425చూసినవారు
బ్రిడ్జిపై ఉధృతంగా వరద నీరు
హుకుంపేట మండలంలోని అడ్డుమండ గ్రామం నుంచి చెక్‌పోస్ట్‌కు వెళ్లే మార్గంలోని వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరగడంతో పాటు వంతెన సమీపంలో చెట్టు కొమ్మ కూలింది. దీంతో ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు రహదారికి ఇరువైపులా రాకపోకలను నిలిపివేసి మూసివేశారు. గతంలో ఇదే వంతెనపై వరద ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు వంతెన వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్