కొమరాపురంలో తావీదు పేరుతో మోసం

274చూసినవారు
అమాయకత్వమే ఆసరాగా గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళను మోసం చేసిన ఘటన రాజవొమ్మంగి మండలం కొమరాపురంలో వెలుగుచూసింది. లోవకుమారి అనే మహిళ వాహనం కోసం వేచిచూస్తుండగా, బైక్ పై వచ్చిన ఇద్దరు లిఫ్ట్ ఇచ్చారు. మార్గమధ్యలో తావీదుతో కష్టాలు తీరుస్తామని నమ్మించి, మాయమాటలతో ఆమె బంగారు కమ్మలను తీసుకొని పరారయ్యారు. బాధితురాలు ఆలస్యంగా మోసాన్ని గుర్తించి లబోదిబోమంది.

సంబంధిత పోస్ట్