గంగవరం మండలం రాములుదేవుపురం సమీపంలో కొండపై పులి ఉన్నట్లు ట్రాకర్ ద్వారా గుర్తించారు. పులిని బంధించేందుకు పూణే నుంచి రెస్క్యూ టీమ్స్ వస్తున్నాయని సబ్ DFO సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం తెలిపారు. ఇప్పటికే వైజాగ్, రాజమండ్రి నుంచి రెండు రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. శనివారం రాత్రికి మరో రెండు బృందాలు వస్తాయని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.