అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో శివలింగపురం టోల్గేట్ వద్ద గోస్తని నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. తల లేని శరీర భాగాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో సుమారు ఐదు రోజుల క్రితం మరణించి ఉండవచ్చని నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.