భార్య ఆత్మహత్య కేసులో భర్తకు రిమాండ్: పెదబయలు సీఐ

0చూసినవారు
భార్య ఆత్మహత్య కేసులో భర్తకు రిమాండ్: పెదబయలు సీఐ
పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ మండిబ గ్రామానికి చెందిన అరుణకుమారి (27) భర్త నవీన్ సాగర్ వేధింపులతో మనస్తాపానికి గురై ఈ నెల 9న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో భర్త నవీన్ సాగర్‌ను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు జి.మాడుగుల సీఐ ఎస్.లక్ష్మణరావు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్