జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం వద్ద ఆదివారం ఐఏఎస్ అధికారులు సందడి చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ వైశాలి, జైపూర్ సబ్ కలెక్టర్ సస్యరెడ్డి జలపాతాన్ని సందర్శించి, సహజ సిద్ధంగా ఏర్పడిన అందాలను ఆస్వాదించారు. వారు అక్కడ స్నానాలు చేసి, ఉత్సాహంగా సమయం గడిపారు.