గోస్తానీ నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. కాజ్‌వేకు ముప్పు

990చూసినవారు
గోస్తానీ నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. కాజ్‌వేకు ముప్పు
అనంతగిరి మండలం బీంపోలు పంచాయతీ పరిధిలోని ఎగువ నువ్వా గ్రామ సమీపంలో గోస్తానీ నది కాజ్‌వే కింద జేసీబీలతో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఇసుక తొలగింపు వల్ల నేలకోత ఏర్పడి, వర్షాకాలంలో కాజ్‌వే దెబ్బతినే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేసి, శాశ్వత బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఈ సంఘటన అరకు వ్యాలీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్