అరకులో జరిగిన చలి ఉత్సవాల్లో జేసీ శ్రీపూజ 'అదిరిపోద్ది సంక్రాంతి', 'ఇదేమిటమ్మా మాయ మాయ' పాటలకు నాన్ స్టాప్‌గా డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఆమెతో పాటు కలెక్టర్ దినేశ్ కుమార్, పలువురు అధికారులు, సిబ్బంది కూడా డాన్స్ చేసి ఉత్సవాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.