లకేపుట్టు మత్స్యగడ్డలో లభ్యమైన మహిళ మృతదేహాన్ని తరలించడంలో పెదబయలు పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు గడ్డ ప్రాంతం నుంచి సుమారు కిలోమీటరు దూరం వరకు మృతదేహాన్ని మోసుకుంటూ అంబులెన్స్‌లో ఎక్కించారు. మానవీయ దృక్పథంతో స్పందించిన పోలీసుల సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు.