చింతూరు మార్గంలో లారీ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

460చూసినవారు
చింతూరు మార్గంలో లారీ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
చింతూరు మండలం తులసిపాక సమీపంలో బుధవారం రాజమహేంద్రవరం నుంచి చింతూరు వెళ్తున్న గూడ్స్ లారీ (CG 18S 8034) ప్రమాదవశాత్తు దగ్ధమైంది. లారీ వెనుక టైర్ల నుంచి వచ్చిన నిప్పురవ్వలు మంటలుగా మారి వాహనాన్ని పూర్తిగా దహనం చేశాయి. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పూర్తి వివరాల కోసం విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్