అల్లూరి జిల్లాలో నూతన ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక

13చూసినవారు
అల్లూరి జిల్లాలో నూతన ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండలం, శోభకోట గ్రామపంచాయతీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నూతన ఎస్.ఎం.సి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. పిల్లల తల్లిదండ్రుల అభీష్టం మేరకు గడ్డాల గోపాలకృష్ణ చైర్మన్‌గా, లకే కనకమాలక్ష్మి వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లతో ప్రమాణస్వీకారం చేయించారు. పాఠశాల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించాలని ఉపాధ్యాయులు కొర్ర కృష్ణారావు, మర్రిచెట్టు రమేష్ నాయుడు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్