అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మహోత్సవం: అవగాహనతో ఆరోగ్యమే శ్రీరామరక్ష

1758చూసినవారు
అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మహోత్సవం: అవగాహనతో ఆరోగ్యమే శ్రీరామరక్ష
అరకు వ్యాలీలోని అనంతగిరి మండలం, బొర్రా సెక్టార్‌ పరిధిలోని నిన్నీమామిడి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఆహార మహోత్సవం జరిగింది. టీచర్ పద్మిని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ సరస్వతి పాల్గొని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, సమతుల ఆహారం, రక్తహీనత నివారణ, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు, గుడ్లు వంటి పోషకాహార పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ మహోత్సవం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో చైతన్యం పెరిగింది.

సంబంధిత పోస్ట్