అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి

85చూసినవారు
అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతి
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పాచిపెంట మండలం తంగలాం గ్రామానికి చెందిన జి.సురేష్, అల్లూరి సీతా రామరాజు జిల్లా అరకు వ్యాలీ కందులగుడ్డి గ్రామానికి చెందిన వంతల రాజబాబు (42) స్నేహితులు. ఈనెల 28న రాజబాబు తంగలాంలోని స్నేహితుడి ఇంటికి వచ్చారు. 29న ఉదయం ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులకు సమాచారం అందింది. అయితే కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి అక్కడి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్