అల్లూరి జిల్లాలో పలు చోట్ల వర్షం

148చూసినవారు
అల్లూరి జిల్లాలో పలు చోట్ల వర్షం
అల్లూరి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి వాతావరణం మారి పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి వంటి మండలాల్లో రాత్రంతా వర్షం కురిసింది. సోమవారం ఉదయం కూడా ముసురు వాతావరణం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే వరిపంట కోత దశకు చేరుకుంది. ఇప్పటికే కొందరు రైతులు కోతలు మొదలుపెట్టగా, వర్షం పడుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్