అరకు వ్యాలీ మండలంలో రోడ్డు ప్రమాదం

610చూసినవారు
అరకు వ్యాలీ మండలంలో రోడ్డు ప్రమాదం
అరకు వ్యాలీ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. మండల కేంద్రంలోని పానిరంగ్ని వద్ద ఆటో, పల్సర్ బైక్ వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రవ్వలగుడ గ్రామానికి చెందిన బురిడి జయకు కుడి చేతి ఎముక విరిగింది, క్రిష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాద కారణాలను పరిశీలిస్తున్నారు.