అల్లూరి జిల్లా అరకువేలు మండలం బస్కి పంచాయితీ నుండి పైనంపాడు పంచాయితీకి వెళ్లే ప్రధాన రహదారి దేవరపల్లి గ్రామ సమీపంలో గత నెలలో కురిసిన భారీ తుపాను దాటికి కొట్టుకుపోయింది. ఈ మార్గం గుండా హుకుంపేట, అనంతగిరి, డుంబ్రిగుడ, అరకువేలి మండలాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.