అనారోగ్యంతో విలవిల.. డోలియే దిక్కు

152చూసినవారు
అనారోగ్యంతో విలవిల.. డోలియే దిక్కు
అనంతగిరి మండలంలోని డి. బంధవలస గ్రామంలో రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న మజ్జి బుజ్జిబాబును కుటుంబ సభ్యులు శనివారం సుమారు మూడు కిలోమీటర్ల దూరం కొండలు, అటవీ మార్గం గుండా డోలీలో మోసుకెళ్లారు. మెయిన్ రోడ్డుకు చేరుకున్నాక ఆటోలో ఎస్. కోటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అతనికి మలేరియా, టైఫాయిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

సంబంధిత పోస్ట్