అరకువేలీ టెన్స్ ఫలితాల్లో విచిత్రం

680చూసినవారు
అరకువేలీ టెన్స్ ఫలితాల్లో విచిత్రం
పాడేరు ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలల ఫలితాల్లో అరకువేలీ మండలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అరకు స్పోర్ట్స్ స్కూల్ 84 శాతం ఉత్తీర్ణతతో జిల్లాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, అదే మండలంలోని అరకు పీవీటీజీ (బాయ్స్) స్కూల్ కేవలం 32 శాతం ఉత్తీర్ణతతో అత్యల్ప ఫలితాలను నమోదు చేసింది. ఐటీడీఏ పరిధిలోని మొత్తం 9 పాఠశాలల్లో 721 మంది విద్యార్థులకు గానూ 442 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాలు విద్యార్థుల విద్యా ప్రమాణాలపై చర్చకు దారితీశాయి.

సంబంధిత పోస్ట్