అనంతగిరి మండలంలోని కోనపురం పంచాయతీ కరాయిగుడ గ్రామంలో శనివారం పిడుగుపాటుకు 13 ఏళ్ల ప్రతిభ భారతి అనే విద్యార్థిని మృతి చెందింది. భారీ వర్షం సమయంలో కొత్తగా నిర్మిస్తున్న పీఎం జన్మన్ గృహాల వద్ద తలదాచుకుంటుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.