వాగు పొంగడంతో బడికి వెళ్లలేకపోతున్న తట్టపూడి విద్యార్థులు

1చూసినవారు
వాగు పొంగడంతో బడికి వెళ్లలేకపోతున్న తట్టపూడి విద్యార్థులు
అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీ తట్టపూడి విద్యార్థులు బోడిగరువు బడికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా వాగు పొంగిపొర్లడంతో విద్యార్థులు కాలినడకన పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆదివాసీ పరిరక్షణ సమితి మండల అధ్యక్షులు సోమేల స్వామి, మెంబర్ పాడి గోపాలరావు ఆరోపించారు. తక్షణమే బోడిగరువుకు రోడ్డు వేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్