అల్లూరి జిల్లాలోని సమ్మగిరి–ఎర్రవరం జలపాతం భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సరికొత్త అందాలను సంతరించుకుంది. ఎత్తైన కొండల మధ్య నుంచి పాలధారలా జాలువారుతున్న ఈ జలపాతం, చుట్టూ పచ్చని అడవులు, మేఘాల మధ్య కనిపించే కొండలతో ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.