రూపా రిసార్ట్స్ ఘటనకు ముగ్గురు మైనర్లు కారకులు

945చూసినవారు
రూపా రిసార్ట్స్ ఘటనకు ముగ్గురు మైనర్లు కారకులు
అరకులోయలోని రూపా రిసార్ట్స్ వద్ద ఈ నెల 24న జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులైన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పాడేరు డీఎస్పీ అభిషేక్ ఆదివారం తెలిపారు. విచారణలో రూపా రిసార్ట్స్‌లో పనిచేస్తున్న మైనర్లే నిందితులుగా గుర్తించి, ఈ నెల 28న వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మైనర్లను పనిలో పెట్టుకున్న రిసార్ట్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్