పులి అడ్డా మారింది: దేవీపట్నం రేంజ్ అధికారి

2చూసినవారు
పులి అడ్డా మారింది: దేవీపట్నం రేంజ్ అధికారి
దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి తన స్థానాలను మార్చుతూ తిరుగుతుండటంతో దాని జాడను కనుక్కోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. ఎక్కువగా కొండల్లో ఉంటున్నందున, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించేందుకు వీలు కుదరడం లేదని ఆయన చెప్పారు. ఈ పులి గంగంపాలెం కొండ నుంచి చిన్న రమణయ్యపేట కొండకు మకాం మార్చిందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్