దేవీపట్నం మండలం చిన్న రమణయ్యపేట, సీతారం గ్రామాల సమీపంలో కొండ పక్కన వెదురు పొదల్లో పులి సంచారం ఉన్నట్లు ఇందుకూరు అటవీశాఖ రేంజ్ అధికారి కొండలరావు శనివారం తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చేందుకు నిపుణులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అటువైపు రావద్దని అధికారులు హెచ్చరించారు.