భీమిలి మండలం నేరెళ్లవలస గ్రామ పరిధిలోని బీచ్లో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం సుమారు 8 గంటలకు భోగ్గు రోడ్-2 సచివాలయ వీఆర్వో బింగి రాము పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు బొడ్డుకు క్లిప్ ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై భీమిలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. దివాకర్ యాదవ్ కేసు నమోదు చేసి, శిశువు గుర్తింపు, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.