విశాఖలో భారీగా ట్రాఫిక్ జామ్

3చూసినవారు
విశాఖలో భారీగా ట్రాఫిక్ జామ్
విశాఖపట్నంలోని ఆనందపురం జాతీయ రహదారిపై గురువారం భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్న ఓటర్ల వాహనాల రద్దీతో ఆనందపురం నుంచి భీమిలి క్రాస్‌రోడ్డు వరకు వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఈ ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు పోలీసులు ఎక్కడా కనిపించకపోవడంపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్