మధురవాడకాలువలో వ్యర్థాల తొలగింపు

1చూసినవారు
మధురవాడకాలువలో వ్యర్థాల తొలగింపు
మధురవాడ GVMC 5వార్డు పరిధిలోని వైఎస్సార్‌ నగర్ చివరి భాగంలో ఉన్న గడ్డ కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలను జీవీఎంసీ కార్మికులు బుధవారం తొలగించారు. వైఎస్సార్‌ కాలనీలో పర్యటించిన శానిటరీ సూపర్‌వైజర్ శ్రీనివాస్ రాజు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి ఉండటాన్ని గమనించారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, వెంటనే ఆ వ్యర్థాలను క్లీన్ చేయాలని స్థానిక సూపర్‌వైజర్‌ను ఆయన ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన జీవీఎంసీ కార్మికులు బుధవారం సాయంత్రానికి కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించి కాలువను శుభ్రం చేశారు. స్థానికులు SS శ్రీనివాసరాజును అభినందించారు

సంబంధిత పోస్ట్