
చోడవరం;ముగిసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం
చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఒకటి వారి ఆధ్వర్యంలో నరసయ్య పేట గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక సేవా శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉగ్గిన నాగబాబు, ఉగ్గిన గౌరీ శంకరి, ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్ కుమార్, రిటైర్డ్ లెక్చరర్ ఎన్ దేముడు, హెచ్ఎం అరుణ, రాజు, సమన్వయకర్తలు డాక్టర్ నారాయణ మూర్తి, డాక్టర్ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యతో పాటు దేశ సేవ, మానవ సేవలో భాగస్వామ్యం అయినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని వాలంటీర్లకు సూచించారు.







































