Feb 09, 2026, 07:02 IST/
తెలంగాణలో 9వ తేదీ నుంచి 11 వరకు మద్యం దుకాణాలు బంద్
Feb 09, 2026, 07:02 IST
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ డ్రై డే ప్రకటించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి 11న సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో, ఆ రోజు కూడా సంబంధిత మున్సిపాలిటీల పరిధిలో వైన్స్, బార్లను మూసివేయాలని ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అధికారులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచారు, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.