బుచ్చయ్యపేటలో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపునకు బీజేపీ పిలుపు

3చూసినవారు
బుచ్చయ్యపేటలో ఎన్డీఏ అభ్యర్థుల గెలుపునకు బీజేపీ పిలుపు
బుచ్చయ్యపేట మండల బీజేపీ అధ్యక్షుడు సీతా నాగరాజు బుధవారం మాట్లాడుతూ మండలంలోని 19 ఎంపీటీసీ సెగ్మెంట్లలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి, గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఎంపీపీ అభ్యర్థి గేదెల సత్యనారాయణ, జడ్పీటీసీ అభ్యర్థి పోతల భవాని రమేష్ గెలుపు మండల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులకు ఎంపీ సీఎం రమేష్, కేఎస్ఎన్ఎస్ రాజు, పీవీఎస్ఎన్ రాజుల ఆశీస్సులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి విజయం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్