
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
విశాఖ జిల్లాలోని నాయుడుతోట వద్ద సర్వీసు రోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ వాహనం వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే మరణించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతురాలి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







































