ఉరేసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య

1129చూసినవారు
ఉరేసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నంలో ఆంధ్ర వైద్య కళాశాలలో ఈఎన్టీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన డి.శ్రావణి (27) తాను ఉంటున్న అద్దె గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వైద్య విద్య చదవడం తనకు ఇష్టం లేదని శ్రావణి తరచూ సహ విద్యార్థినులతో చెప్పి బాధపడేదని, ఆ కారణంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కువైట్ లో ఉంటూన్న మృతురాలి తల్లిదండ్రులకు పోలీసులు  సమాచారం అందించారు. ఈ ఘటనపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్