విశాఖ: ప్రభుత్వ కార్యాలయం ముందు బైఠాయించి మహిళ ఆందోళన

845చూసినవారు
విశాఖ: ప్రభుత్వ కార్యాలయం ముందు బైఠాయించి మహిళ ఆందోళన
విశాఖ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ముందు శనివారం కృష్ణకుమారి అనే మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. తన భర్త ఇటీవల రిటైర్ అవ్వగా, గ్రాట్యూటీ చెల్లించడానికి సిబ్బంది లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. తన కుమార్తె పెళ్లి ఉందని, డబ్బులు లేవని ఆమె వాపోయింది. ఈ నిరసనతో కార్పొరేషన్ ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్