
విశాఖ: భక్తులతో పోటెత్తిన సింహగిరి
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా సింహగిరి భక్తులతో సోమవారం కిక్కిరిసిపోయింది. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ఉచిత దర్శనంతో పాటు రూ. 300, రూ. 1000, రూ. 1500 ప్రత్యేక దర్శన క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం రూ. 300 టికెట్ ఉన్న వారికి 3 గంటలు, రూ. 1000 టికెట్ వారికి 2 గంటలు, రూ. 1500 టికెట్ వారికి గంట సమయం పడుతోంది. ఉచిత దర్శనం కోసం వచ్చే భక్తులు మాత్రం సుమారు 5 గంటలకు పైగా వేచి చూడాల్సి వస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

































