తండ్రి చేతుల మీదుగా అంత్యక్రియలు.. ఖైదీకి బెయిల్ మంజూరు

732చూసినవారు
తండ్రి చేతుల మీదుగా అంత్యక్రియలు..  ఖైదీకి బెయిల్ మంజూరు
మాడుగుల మండలం జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు, గంజాయి రవాణా కేసులో విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. గత నెల 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని పెద్ద కుమారుడు సాయి కిరణ్ (17) మరణించాడు. మూడేళ్ల క్రితం చిన్న కుమారుడు జితేంద్ర అనారోగ్యంతో మరణించడంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. తండ్రి చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎస్పీ తుహిన్సిన్హాను కోరారు. ఎస్పీ స్పందించి, జూన్ 2న రాజుకు ఒకరోజు తాత్కాలిక బెయిల్ మంజూరు చేశారు. పోలీసు భద్రత నడుమ రాజు జంపెన గ్రామానికి చేరుకుని తన కుమారుడు సాయికిరణ్ కు పిండప్రదానం పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్