మాడుగులలో ఉత్సాహంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రక్రియ

1చూసినవారు
మాడుగులలో ఉత్సాహంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ప్రక్రియ
మాడుగుల మండలం జమ్మదేవిపేట గ్రామ పంచాయతీ పరిధిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. యువకులు, మహిళలు, వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సిబ్బంది పర్యవేక్షణలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్