May 21, 2026, 15:05 IST/నాంపల్లి
నాంపల్లి
బాలికపై అఘాయిత్య యత్నం: నిందితుడికి 5 ఏళ్ల జైలు
May 21, 2026, 15:05 IST
చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు మొహమ్మద్ మొయిన్ మొహియుద్దీన్‌కు గురువారం హైదరాబాద్ పోక్సో కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10,000 జరిమానా విధించింది. 2024లో చాక్లెట్ ఇస్తానని మాయమాటలు చెప్పి బాలికను భవనంపైకి తీసుకెళ్లి నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎస్హెచ్ఓ మురారి పర్యవేక్షణలో ఎస్ఐ రవిరాజ్ ఈ కేసును దర్యాప్తు చేశారు.