
పంచరామాల దర్శనార్థం నర్సీపట్నం నుంచి ప్రత్యేక బస్సులు
నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి పంచరామాల దర్శనార్థం ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించినట్టు డిపో మేనేజర్ ధీరజ్ శుక్రవారం తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు నర్సీపట్నం నుంచి బస్సులు బయలుదేరి, సోమవారం ఉదయం పంచరామాల దర్శనం పూర్తి చేసిన తర్వాత తిరిగి నర్సీపట్నం చేరుతాయని ఆయన వివరించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక పిక్నిక్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.







































