May 08, 2026, 08:05 IST/సికింద్రాబాద్
సికింద్రాబాద్
చిలకలగూడ హత్య కేసు: ఐదుగురిపై కేసు
May 08, 2026, 08:05 IST
సికింద్రాబాద్లోని చిలకలగూడలో శుక్రవారం ఒక యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పరమేశ్తో సహా ఐదుగురు నిందితులు ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పాత కక్షలు, ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్లు సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య వెల్లడించారు. నిందితులపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయని, సుపారీ హత్య కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.