
ఆరిలోవలో బీర్ బాటిళ్లతో యువకుడిపై దాడి.. నలుగురు అరెస్ట్
ఆరిలోవ లాస్ట్ బస్ స్టాప్ వద్ద ఉన్న వైన్స్ షాప్లో దినేశ్ అనే యువకుడిపై నలుగురు వ్యక్తులు బీర్ బాటిళ్లతో మంగళవారం మధ్యాహ్నం దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు దినేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు సుధీర్, వంశీ, మోహన్, సుధాకర్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దినేశ్ మద్యం సేవిస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన సుధీర్, వంశీ, మోహన్, సుధాకర్ లతో వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదంలో సుధీర్, సుధాకర్ బీర్ బాటిళ్లతో దినేశ్ పై దాడికి పాల్పడ్డారు.





























