అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు మోట్ల వద్ద ఆదివారం 97 కేజీల గంజాయిని చింతపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ.1.07 లక్షల నగదును కూడా సీజ్ చేసినట్లు చింతపల్లి ఏఎస్పి నవజ్యోతి మిశ్రా తెలిపారు. ఈ ఘటన పాడేరు ప్రాంతంలో చోటుచేసుకుంది.