నిండు గర్భిణీని డోలిమోతతో అసుపత్రికి తరలించారు

2చూసినవారు
అల్లూరి ఏజెన్సీలో గిరిజనులకు డోలిమోత కష్టాలు కొనసాగుతున్నాయి. గురువారం జి.మాడుగుల మండలం కోట్లగరువు గ్రామానికి చెందిన కొర్ర పార్వతికి పురిటినొప్పులు రావడంతో, బంధువులు మూడు కిలోమీటర్ల దూరం డోలీపై మోసుకుంటూ పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు మట్టిరోడ్డు రాళ్ళమయంగా మారడమే ఈ దుస్థితికి కారణమని, తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్