అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పరిధి చింతలపాలెంలో సూకూరు కన్నయ్యదొర అనే గిరిజనుడు వారం రోజులుగా మలేరియా జ్వరంతో బాధపడుతూ శుక్రవారం మరణించాడు. కొండవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో ఆస్పత్రికి తరలించలేకపోయారని గ్రామస్థులు తెలిపారు. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం వస్తున్నారని, కానీ వంతెన, రహదారి సమస్యలను పరిష్కరించడం లేదని వారు ఆరోపించారు.