అనంతగిరి మండలంలోని త్యాడ ఘాట్ రోడ్డులో ఆదివారం ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. భారీ లోడుతో ఎస్.కోట వైపు వస్తున్న లారీ ఘాట్ రోడ్డు వద్ద అదుపు తప్పి వెనుక భాగం గోతిలోకి దిగింది. అదృష్టవశాత్తు డ్రైవర్, క్లీనర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.