అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం అరకు మండలం మాదల, బొండాం, సుంకరమెట్ట పంచాయతీల్లో పర్యటించి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ 16 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే, చంద్రబాబు ప్రైవేటీకరణ చేయడం సరికాదని ఆయన అన్నారు.