మాడుగుల మండలం బోయితీలి పంచాయతీ బోయితీలి గ్రామంలో పదేళ్లుగా డ్రైనేజీ సమస్య కొనసాగుతోంది. వర్షాలు పడినప్పుడు గ్రామం మధ్యలోని కల్వర్ట్ వద్ద నీరు నిలిచిపోతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేదని, రెండుసార్లు కొలతలు తీసుకుని వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య వల్ల సుమారు 20 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అధికారులు స్పందించి డ్రైనేజీ గ్రాంట్ మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.