బ్లీచింగ్ కలిసిన నీరు తాగి ఎద్దు మృతి

612చూసినవారు
బ్లీచింగ్ కలిసిన నీరు తాగి ఎద్దు మృతి
తీవ్ర ఎండల నేపథ్యంలో దాహం తీర్చుకునేందుకు కాలువల వద్దకు వెళ్లే మూగజీవాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. జీకే వీధి పంచాయతీ కేంద్రంలోని కాలువలో చేపలు పట్టేందుకు కొందరు వ్యక్తులు సోమవారం బ్లీచింగ్ పౌడర్ చల్లినట్లు స్థానికులు తెలిపారు. అదే నీటిని తాగిన ఢీకొత్తూరు గ్రామానికి చెందిన రైతు రాంబాబు ఎద్దు మృతి చెందినట్లు బాధితుడు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాధితుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్