అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో సోమవారం చింతల వీధి దగ్గర ఎదురెదురుగా వస్తున్న కారు మరియు ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. వారిని వెంటనే జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. క్షేతగాత్రులు ఎవరన్నది, ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.