ముంచంగిపుట్టు మండలం తోటలమెట్ట గ్రామానికి చెందిన మోహనరావు తోటలమెట్ట నుంచి గల్లెలపుట్టు గ్రామానికి కాలినడకన వెళుతుండగా పిడుగుపాటుకు గురయ్యాడు. ఈ ఘటనలో అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలిపోవడంతో మోహనరావు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని పాడేరులోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.